Beauty Tips : మీ గోళ్ల ఎక్స్ టెన్షన్స్ వద్దు

ఈ మధ్య ఎక్కువ మంది ఆర్టిఫిషయల్ నెయిల్స్, నెయిల్ ఎక్స్ టెన్షన్స్ పెట్టుకుంటున్నారు. ఇవి చూడటానికి అందంగా ఉంటాయి. కానీ, అసలైన గోర్లపై ఎఫెక్ట్ చూపుతాయి అంటున్నారు డాక్టర్లు. ఆర్టిఫిషియల్ గోర్లు పెట్టుకున్న తర్వాత అసలు గోర్లు పెళుసుగా మారుతాయి. అంటే ఈజీగా విరిగిపోతాయి. గోర్లలో కెరటిన్ ఉంటుంది. కృత్రిమ గోర్లు ఆ కెరటిన్ ను దెబ్బతీస్తాయి.

చాలామంది గోర్లు కత్తిరించాక, నెయిల్ కట్టర్ట్ పై రుద్దుతారు. అలా చేసేటప్పుడు గోర్లపై ఉండే క్యుటికల్స్ అనేలేయర్ డ్యామేజ్ అవుతుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కు దారి తీయొచ్చు. 

• గోర్లను తేమగా ఉంచితే ఆరోగ్యంగా పెరుగుతాయి. విటమిన్లు, ప్రొటీన్లు ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. సాధారణంగా గోర్లు పెరగడానికి బయోటిన్ అవసరం. బీ-కాంప్లెక్స్ ఫుడ్ బాగా తీసుకున్నప్పుడు బయోటిన్ పెరుగుతుంది. గోర్ల ఆరోగ్యానికి అవసరమైన ప్రొటీన్ అమైనో ఆమ్లాల వల్ల వస్తుంది. 

• పండుగల సందర్భంగా తప్పని సరిగా ఆర్టిఫిషియల్ గోర్లు పెట్టుకోవాల్సి వస్తే పండుగ పూటే పెట్టుకొని వెంటనే తీసేయాలి.

• అన్ని జాగ్రత్తలు తీసుకున్నా గోర్లు హెల్దీగా లేవనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్ కు చూపించుకోవాలి.