Tips for Apples: యాపిల్స్ కొనేటప్పుడు జాగ్రత్త.. పొరపాటును కూడా ఇలాంటివి కొనొద్దు!

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది తినాలన్నా.. భయమేస్తుంది. కారణం కల్తీ. ఇప్పుడు పండ్లలో కూడా కల్తీ చేస్తున్నారు. రసాయనాలు కొట్టి యాపిల్స్‌ను అమ్మేస్తున్నారు. అవి తినడం వల్ల ప్రయోజనాల సంగతి పక్కన పెడితే.. నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఎలాంటి యాపిల్స్ కొనేటప్పుడు  తీసుకోవాలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. . .

ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటారన్న విషయం అందరికీ తెలుసు. డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. రోజుకో యాపిల్ తింటే.. అనారోగ్య సమస్యలకు, డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చు. యాపిల్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి.   వీటిలో విటమిన్ కె. విటమిన్ సి, ఫైబర్, పొటాషియం  మినరల్స్, ఫైబర్,  ఇలా అన్నీ పుష్కలంగా యాపిల్ ద్వారా శరీరానికి అందుతాయి. అందుకే రోజుకు ఓ యాపిల్ అయినా తినమని చెబుతారు. యాపిల్స్ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. బరువు తగ్గాలని భావించే వారిని యాపిల్ తినాలని సూచిస్తారు. కానీ 240 గ్రాముల బరువున్న ఆపిల్లో 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది.  ఈ బ్యాక్టీరియా కారణంగా ఒక్కోసారి సమస్యలు తలెత్తే అవకాశం ఉందరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి యాపిల్ పండ్లను కొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  . 

యాపిల్ పండ్లలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా గింజల్లోనే ఉంటుంది. తర్వాత పల్ప్ బ్యాక్టీరియా ఎక్కువ గా ఉంటుంది. అయితే బ్యాక్టీరియా రెండు రకాలుగా ఉంటుంది. అందులో కొన్ని మన పేగులకు మంచి చేసే బ్యాక్టీ రియా కాగా మరికొన్ని మాత్రం అనా రోగ్య సమస్యలు సృష్టిస్తాయి. ఏదేమైన ప్పటికీ యాపిల్ కొనేముందే తాజాగా ఉందా? పాడైందా? జాగ్రత్తగా చూసి కొనాలని చెబుతున్నారు.

బరువును బట్టి..

చాలా మంది బరువుగా ఉండే యాపిల్స్ మంచివి అనుకుంటారు. అలా అస్సలు అనుకోకండి. మీరు రుచిగా, తియ్యగా ఉండే యాపిల్స్ తినాలి అనుకుంటే.. చిన్న పరిమాణంలో ఉండే యాపిల్స్ తీసుకోండి. ఇవి బరువు కూడా తక్కువగా ఉంటాయి. పెద్దగా ఉండే యాపిల్స్ చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

రంగును బట్టి

సాధారణంగా యాపిల్స్ లేత పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లోనే ఎక్కువగా లభ్యమవుతాయి. కానీ ఎర్రగా ఉండే యాపిల్స్ చాలా మంచివి అనుకుంటారు. వీటికే ఎట్రాక్ట్ అయి కొంటూ ఉంటారు. కానీ వాటికి ఈ మధ్య కలర్స్ కూడా వేస్తున్నారు. అయితే లేత ఎరుపు – ఆకు పచ్చ రంగు, పసుపు – ఎరుపు.. ఇలా మిక్డ్స్ కలర్ యాపిల్సే తియ్యగా, చాలా రుచిగా ఉంటాయి. పూర్తిగా ఆకు పచ్చలో ఉండే యాపిల్స్ మాత్రం పుల్లగా ఉంటాయి. జ్యూసులకు అయితే పసుపు రంగు యాపిల్స్ బెస్ట్.

వాసనతో..

యాపిల్స్ నుంచి సువాసన ఎక్కువగా వస్తుంటే.. అవి చాలా తియ్యగా ఉండే పండ్లని తెలుసుకోండి. వాసన సరిగా రాకపోతే.. వాటిల్లో స్వీట్ నెస్ అనేది తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో వాసన చూసి పండ్లను గెస్ చేయలేం.

తాకి చూసి కొనండి:

యాపిల్స్ ఎలా ఉన్నాయన్నది.. చూస్తేనే అర్థమువుతుంది. వాటిపై మచ్చలు, చారలు వంటివి ఉంటే అస్సలు తీసుకోకండి. అవి తక్కువగా ఇచ్చినా వేస్ట్. ఎందుకంటే అవి ఆల్రేడీ సగం పోయి ఉంటాయి. కాబట్టి పూర్తిగా మంచిగా ఉండే పండ్లనే తీసుకోండి.