Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్​

వేసవిలో పెరుగును ఎక్కువగా తీసుకుంటారు. కారణం శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పెరుగును అనేక విధాలుగా తీసుకోవచ్చు. పరాటాలు, లస్సీ రూపంలో, మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. పెరుగును రైతా, పెరుగు అన్నం, దహీ రూపంలో కూడా తినవచ్చు. పెరుగు వంటకం రుచిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పెరుగులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అవి మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పెరుగును తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాల్సిందే. అయితే, కొన్ని ఆహారాలతో పాటు దీనిని తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇది పుడ్ పాయిజన్ అయి.. అనారోగ్యానికి కారణం అవుతుంది. మరి పెరుగుతో తినకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండాకాలంలో ప్రతిరోజూ పెరుగు తినడం ఆరోగ్యకరం. పెరుగు మంచి ప్రోబయోటిక్, మీ పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అయితే పెరుగును ఎలాపడితే అలా తినకూడదు. కొన్నిరకాల ఆహార పదార్థాల కలయికలు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తాయి. పెరుగులో పండ్లు కలుపుకొని తినవచ్చు, సలాడ్, రైతా వంటివి చేసుకొని తినవచ్చు. కానీ ఇవి చేసే విషయంలో పెరుగులో కొన్నింటిని కలపకూడదు. 

మామిడి ...పెరుగు: మామిడి అనేది వేసవిలో ప్రసిద్ధి చెందిన సీజనల్ ఫ్రూట్. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇతర విలువైన పోషకాలు ఉంటాయి, కానీ మామిడి వేడి గుణాలు కలిగి ఉంటుంది. పెరుగు చలువ గుణాలు కలిగి ఉంటుంది. ఈ రెండింటి కలయిక శరీరంలో వేడి, చల్లని అసమతుల్యతను కలిగిస్తుంది. ఇది చర్మ సమస్యలను కలిగిస్తుంది, చర్మంపై దద్దుర్లు, మొటిమలు ఏర్పడటానికి దారితీస్తుంది. శరీరంలో టాక్సిన్స్ ఉత్పత్తిని పెంచుతుంది.

పెరుగు ....పాలు: పాలను పులియబెట్టినపుడు పెరుగు అవుతుంది. కానీ పెరుగు, పాలు కలిపి తీసుకోవడం సరైన కాంబినేషన్ కాదు. ఈ రెండింటిని కలపి తీసుకోవడం వల్ల అసిడిటీ, ఉబ్బరం, గుండెల్లో మంటకు దారితీస్తుంది. విరేచనాలు కూడా కలగవచ్చు. గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను పెంచుతుంది. ఎందుకంటే పాలు భారంగా ఉంటాయి, కడుపు నిండినట్లు అవుతుంది. అయితే పెరుగు తేలికగా , సులభంగా జీర్ణమవుతుంది. అందువల్ల కలిపి తీసుకోవద్దు.

పెరుగు...  ఆయిల్ ఫుడ్స్: పెరుగుతో పాటు నెయ్యి, నూనెతో కూడిన ఆహారాలు తీసుకోవద్దు. ఇవన్నీ పరస్పరం విరుద్ధమైన ఆహారాలు. పెరుగుతో పాటు ఆయిల్ ఫుడ్స్‌ను తీసుకున్నప్పుడు మీ జీర్ణక్రియ నెమ్మదిస్తుంది, నిద్రమత్తు ఎక్కువ ఉంటుంది. దీంతో మీరు రోజంతా మీరు సోమరితనం అనుభూతి చెందుతారు.

పెరుగు.. ఉల్లిపాయ:పెరుగు, ఉల్లిపాయలను చాలాసార్లు కలిపి తీసుకుంటారు. కానీ ఈ రెండు కలిపితీసుకుంటే అవి అలెర్జీలను ప్రేరేపిస్తాయి. గ్యాస్, అసిడిటీ, వాంతులను కూడా కలిగిస్తాయి. కారణం పెరుగు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఉల్లిపాయ దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఫలితంగా, ఈ రెండు ఆహారాలను కలపడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మనలో చాలామంది పెరుగు, ఉల్లిపాయలను కలిపి చేసినా రైతా వంటివి ఎక్కువ తీసుకుంటారు. కానీ ఇది మంచిది కాదు.

చేపలు... పెరుగు: మాంసాహారం వండేటపుడు మాంసాన్ని పెరుగుతో మెరినేట్ చేస్తారు. కానీ చేపలు, సీఫుడ్ లతో పెరుగును కలపకూడదు. పెరుగు- చేపలు కలిపి తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం ఉంటుంది

ఉరద్ పప్పు... పెరుగు: పెరుగును ఉరద్ పప్పుతో కలిపి తినకూడదు. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పాడవుతుంది. అజీర్ణం, అతిసారం, ఉబ్బరం సమస్య వస్తుంది.