టెక్నాలజీ : స్పామ్​కాల్స్ అసలు రావొద్దంటే..ఇదే పర్మినెంట్​ సొల్యూషన్..

ఈ మధ్య స్పామ్​కాల్స్ ఎక్కువైపోయాయి. అయితే చాలామంది వీటి పట్ల అవేర్​నెస్​తో ఉన్నారు. కానీ, పదేపదే కాల్స్ వస్తే ఎన్నిసార్లు అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక పర్మినెంట్​ సొల్యూషన్ ఉండాలి కదా అనిపిస్తుంటుంది. అందుకోసమే డీఎన్​డీ (డు నాట్ డిస్టర్బ్​) ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలి. 

స్పామ్​ కాల్స్ అసలు రావొద్దంటే ముందుగా నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్​లో మీ ఫోన్ నెంబర్ నమోదు చేసుకోవాలి. ఇందులో రిజస్టర్ అయిన నెంబర్లకు టెలీ మార్కెటింగ్ కాల్స్ రావు. డీఎన్​డీ (డు నాట్ డిస్టర్బ్‌) ఫీచర్ యాక్టివేట్ చేసుకోవాలంటే..1909 నెంబర్​కు START అనే మెసేజ్​ పంపాలి. దీంతో బ్యాంకింగ్, హాస్పిటాలిటీ వంటి వివిధ రంగాలకు సంబంధించిన కోడ్స్​తో ఒక మెసేజ్​ వస్తుంది. అందులో ఏ రంగానికి చెందిన కాల్స్ బ్లాక్ చేయాలనుకుంటే దాని కోడ్​ను మెసేజ్​ చేయాలి. 24 గంటల తర్వాత యూజర్ల రిక్వెస్ట్​ ప్రాసెస్ అవుతుంది. మీరు ఎంచుకున్న రంగానికి సంబంధించిన కాల్స్ రావు. 

అలాగే థర్డ్ పార్టీకి సంబంధించిన కమర్షియల్ కాల్స్ అన్నీ బ్లాక్ అవుతాయి. ఈ ఫీచర్​ని యాక్టివేట్ చేయడానికి కస్టమర్లు టెలికాం సర్వీస్​ ప్రొవైడర్​ని కూడా వాడొచ్చు. జియో యాప్, ఎయిర్ టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్​లలో కస్టమర్లు డీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ సర్వీసును యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్​ ఫోన్​లలో ఫిల్టర్ స్పామ్​ ఫీచర్​ని కూడా వాడొచ్చు. ఫోన్ యాప్​లోని సెట్టింగ్స్​లోకి వెళ్లి, అందులోని ఫిల్టర్ స్పామ్ కాల్స్​లో సీ కాలర్ అండ్ స్పామ్​ ఐడీ ఆప్షన్​ని  ఎంచుకోవాలి. దీంతో కాంటాక్ట్​ లిస్ట్​లో లేని నెంబర్ల నుంచి కాల్స్ వస్తే ఆటోమెటిక్​గా సైలెంట్ అయిపోతాయి.