హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లో  శ్రీమాధవి నర్సింగ్ హోం సీజ్ 

హుజూరాబాద్, వెలుగు : లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ, అబార్షన్లు చేస్తున్న హుజూరాబాద్ పట్టణంలోని ఓ నర్సింగ్‌‌‌‌‌‌‌‌ హోంను డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో సుజాత శుక్రవారం సీజ్​ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన యువతికి ఇదే హాస్పిటల్ లో ఐదు నెలల కింద అబార్షన్ చేయగా.. ఇటీవల ఆమె హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది.

ఈ కేసులో హాస్పిటల్ నిర్వాహకుడు కర్ర పాపిరెడ్డితోపాటు ఆర్ఎంపీ సత్యనారాయణ, సిబ్బంది రజితను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా ఈ కేసు విషయంలో ఇక్కడి వైద్యాధికారులకు సమాచారం అందడంతో శుక్రవారం నర్సింగ్‌‌‌‌‌‌‌‌హోంను తనిఖీ చేశారు. అనంతరం హాస్పిటల్ ను సీజ్ చేశారు. డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోతోపాటు ఎంసీహెచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సనా జువేరియా

డిప్యూటీ డీఎంహెచ్ఓ చందు, జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ రంగారెడ్డి, ఎస్‌‌‌‌‌‌‌‌వో కాంతారావు, సీహెచ్‌‌‌‌‌‌‌‌వో సాజిద్ హుస్సేన్ ఉన్నారు.  కాగా కొంతకాలంగా జమ్మికుంట, హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ లింగ నిర్ధారణ పరీక్షలతోపాటు, అబార్షన్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.