హిందూమతంలో దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగకు ఇంటినంతా దీపాల కాంతులతో నింపుతారు. అందుకే ఈ పండుగను దీపోత్సవం అని కూడా అంటారు. దీపావళి పండుగ పర్వదినాన లక్ష్మీదేవిని, గణపతిలను పూజిస్తారు. అయితే దీపావళికి ముందే కొన్ని పనులను చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొందుతారట. అవేంటంటే?
ప్రతి ఏడాది దీపావళి పండుగను ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు. హిందువుల ప్రధాన పండుగలలో దీపావళి ఒకటి. ఈ ఏడాది (2023) దీపావళి పండుగను నవంబర్ 12వ తేదీ ఆదివారం నాడు జరుపుకోబోతున్నాం. ఇప్పటికే దీపావళి పండుగకు అన్ని సిద్దం చేస్తుంటారు. చాలా మంది ఇప్పటి నుంచే ఇండ్లను శుభ్రం చేస్తుంటారు. అయితే దీపావళికి ముందే కొన్ని పనులను చేయడం శుభప్రదంగా, పవిత్రమైనవిగా భావిస్తారు. దీపావళి రోజు టపాసులు కాలుస్తారు.
లక్ష్మీదేవిని ఆహ్వానించండి
ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని భావిస్తారు.పూర్వకాలం ఇంటిమందు ముగ్గులు వేస్తున్నారని చెప్పవచ్చు.ఎందుకంటే అన్ని పురాణాలలో కూడా ఈ రంగవల్లి ప్రస్తావన ఉంది కనుక పూర్వ కాలం నుంచి ఈ ఆచారం ఉండేదని తెలుస్తోంది.ఇంటి ముందు ముగ్గు వేయటం వల్ల శుభ పరిణామాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.ముగ్గువేసి దానికి రెండువైపులా రెండేసి అడ్డుగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతోందని అర్థం. అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవి ఆ ఇంటినుంచి బయటకెళ్లి పోతుందని పెద్దలు చెబుతారు. ముగ్గు మధ్యలో పసుపు, కుంకుమ చల్లి ముగ్గు మధ్యలో దీపాలు పెట్టాలి.
ధన త్రయోదశి షాపింగ్
ఈ ఏడాది నవంబర్ 10న ధనత్రయోదశిని జరుపుకోనున్నారు. అయితే ఈ రోజు షాపింగ్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ధనత్రయోదశి పర్వదినాన లక్ష్మీ దేవి కొత్త వస్తువులను కొనుగోలు చేయండి. వాటిని ఇంటికితీసుకొస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషింస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని నమ్మకం. ముఖ్యంగా ఈ ధనత్రయోదశి నాడు బంగారు వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించండి.
ఈ వస్తువులను ఇట్లో నుంచి పారేయండి
దీపావళికి ముందే మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను బయట పారేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. విరిగిన, పనికిరాని వస్తువులను దీపావళికి మీ ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంట్లో నుంచి తీసేయండి. ఎందుకంటే ఇవి ఇంట్లో ఉండటం శుభప్రదం కాదు. వీటితో పాటుగా విరిగిన దేవుళ్ల విగ్రహాలను కూడా ఇంట్లో పెట్టకూడదు. అయితే వీటిని పవిత్రమైన నదిలోనే నిమజ్జనం చేయండి
వీటిని వెంటనే బయటకు తీయండి
సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా పరిశుభ్రమైన ప్రదేశంలోనే నివసిస్తుంది. కాబట్టి దీపావళికి ముందే మీ ఇంటని శుభ్రం చేయండి. అయితే ఇంటిని క్లీన్ చేసేటప్పుడు పనికిరాని లేదా చెడ్డ గడియారాలను కూడా ఇంట్లో నుంచి బయట వేయండి. ఎందుకంటే ఈ వస్తువులను చెడు కాలానికి సూచికలుగా భావిస్తారు. అంతేకాదు ఇది మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే వీటిని ఇంట్లోంచి వెంటనే బయటపారేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ALSO READ :- పాన్ మసాలా ఆమ్లేట్.. ఛీ ఛీ అంటూనే అందరూ చూస్తున్నారు..!