అమెరికా వైట్ హౌస్‌తోపాటు అంతరిక్షంలోనూ దీపావళి సెలబ్రేషన్స్

దీపావళీ భారతీయులకు పెద్ద పండుగ. అటు నార్త్, సౌత్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా గ్రాండ్ గా దీపావళిని జరుపుకుంటారు ఇండియన్స్. అక్టోబర్ 31న అమెరికా వైట్ హౌస్ లో యూస్ ప్రెసిడెంట్ జో బిడెన్ మరియు అంతరిక్షంలో ఉన్న సునితా విలియమ్స్ దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నట్లు ప్రకటించారు. భారతీయులు ఎక్కడున్నా వారి పండుగలు, ఆచార సంప్రదాయాలు అక్కడ కనిసిస్తాయి. అమెరికాలో కూడా ఇండియన్స్ జనాభా ఎక్కువే.. దీంతో అక్కడ కూడా దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు అధికారిక నివాసం వైట్ హౌస్ లో కూడా దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. 

ఈ మేరకు యూస్ ప్రెసిడెంట్ జో బిడెన్ దంపతులు దీవాళీ వేడుకలు వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్ లో ప్రారంభించారు.దక్షిణాసియా నుంచి అమెరికాకు వచ్చిన వారు ఇక్కడ ప్రతి భాగాన్ని సుసంపన్నం చేశారని US ప్రెసిడెంట్ జో బిడెన్ అన్నారు. వైట్ హౌస్‌లో దీపావళిని బహిరంగంగా, గర్వంగా జరుపుకుంటారు. ఇది నా ఇల్లు కాదు, ఇది మీ ఇల్లు అని ఆయన అన్నారు.

ALSO READ | 2026లోనే గగన్​యాన్​ ప్రయోగం.. కొత్త షెడ్యూల్ ప్రకటించిన ఇస్రో చైర్మన్

ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ఉన్న ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ కూడా స్పేస్ సెంటర్లో దీపావళి జరుపుకోనున్నట్లు ISS నుంచి ప్రకటించారు. ఆమెకు అమెరికా పౌరసత్వం ఉన్నా.. సునీతా తల్లిదండ్రులు భారతీయ మూలాలకు చెందిన వారు. ఆమె తండ్రి ఇండియన్ ట్రెడిషన్ నేర్చించేవాడని సునీతా చెప్పింది. దీపావళి పండుగను గుర్తించినందుకు యూస్ ప్రెసిడెంట్ బిడెన్, హారిస్‌లకు కృతజ్ఞతలు చెప్పారు సునితా విలియమ్స్. అలాగే ప్రపంచవ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు ఆమె. 

భూమికి 260 మైళ్ల ఎత్తులో దీపావళిని జరుపుకోవడం చాలా ప్రత్యేకమైందని సునీతా విలియమ్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి సునీతా విలియమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా అక్కడే ఉండాల్సి వచ్చింది. 2023 జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో బుచ్ విల్మోర్‌తోపాటు ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్లారు. 2025 ఫిబ్రవరి తిరిగి రానున్నారు.