బల్దియా ఆఫీస్‌‌లో దీపావళి వేడుకలు

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ నగరపాలక సంస్థలో దీపావళి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మున్సిపల్ ఆఫీస్‌‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బల్దియాలో నిర్వహించిన లక్ష్మిదేవి పూజలో కమిషనర్ చాహత్ బాజ్‌‌పాయ్‌‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగి వెంకటేశ్వర్‌‌‌‌రావు చెక్కలతో తయారు చేసిన మున్సిపల్ ఆఫీస్‌‌ను మేయర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళిని అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వాల రమణారావు, సరిళ్ల ప్రసాద్, బుచ్చిరెడ్డి, లీడర్ గందె మహేశ్, ఆఫీసర్లు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.