సమాధుల మధ్య దీపావళి జరుపుకుంటరు.. ఎక్కడో తెలుసా..

కరీంనగర్‌‌‌‌లో దళిత కుటుంబాలు ఏటా దీపావళి సందర్భంగా చనిపోయిన తమ పెద్దలు, పూర్వీకులను స్మరించుకోవడం ఆనవాయితీ. కరీంనగర్‌‌‌‌లోని డాక్టర్స్‌‌ స్ట్రీట్, వ్యవసాయ మార్కెట్ సమీపంలోని సమాధుల వద్దకు గురువారం వారి కుటుంబసభ్యులందరూ వచ్చి పూర్వీకులకు ఇష్టమైన ఆహార పదార్థాలు, మద్యాన్ని సమాధుల వద్ద పెట్టి స్మరించుకున్నారు. అలాగే సమాధుల వద్ద పటాకులు కాల్చారు. 

-వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్