Diwali Special : పండుగ వేళ.. ఇల్లు కళకళలాడాలంటే....

దీపావళి వచ్చిందంటే చాలు... ఇల్లంతా వెలుగుల సంతోషాలు పరుచుకుంటాయి.  ఎంతో ఆనందంగా జరుపుకొనే ఈ పండుగకు మరింత అందాన్ని జోడిస్తే ఇంట్లో సంతోషాల మతాబులే.  పండుగపూట ఇంటి డెకరేషన్ కు కొన్ని ఐడియాలు. . .

  • బంతిపూలు లేనిదే దీపావళి లేదంటే అతిశయోక్తి కాదు.  బంతులతో ఇంటిని డెకరేట్ చేస్తే ఇల్లు సంప్రదాయబద్దంగా కనిపిస్తుంది.  మరీ ప్రత్యేకంగా దీపావళి వచ్చిదంటే బంతి కచ్చితంగా ఇంటికి రావాల్సిందే.  రంగు రంగుల బంతులతో పూల ముగ్గులు వేసుకోవచ్చు.  దర్వాజాలకు దండలు పెట్టడమే కాకుండా మెట్లను కూడా బంతిపూలతో డెకరేట్ చేయొచ్చు.  ఇది చాలా ఈజీ కూడా.  బంతిపూల రెక్కలను ముగ్గులపై చల్లినా.. బంతులతోనే పూల ముగ్గులు వేసినా సూపర్ గా ఉంటుంది.  
     
  • ఇంటికి పండుగ కళ రావాలంటే తారొక్క పూల మేళవింపు ఉండాలి.  అందుకు బంతిపూలకు తోడుగా అందుబాటులో ఉండే పూలు అందంతో పాటు సంప్రదాయ లుక్ ఇస్తాయి.  తాజా పూలతో పాటు మామిడి ఆకులు, మల్లె ఆకులు కలిపితే డెకరేషన్ ఇంకా బాగుంటుంది.
     
  • దర్వాజాలను, కిటికీలను పూలతో ఎంత అలంకరించినా... ఇంటి లోపల మూలాలను ఖాళీగా వదిలేయొద్దు.  గదిలోని మూలల్లో టెంపరరీగా పూల కుండీలు పెట్టి వాటికి డెకరేషన్ చేయాలి.  లేదా డెకరూటివ్ గిన్నెల్లో నీళ్లు పోసి వాటిలో పూలు వేసి ఉంచాలి.
     
  • హాల్లో టేబుల్ మీద కచ్చితంగా డెకరేషన్ అవసరం. రకరకాల పూలతో దీన్ని అలంకరించుకోవచ్చు.  దీంతో పాటు టేబుల్ మీద చిన్న సైజు దేవుడి విగ్రహం లేదా పూలతో నింపిన గిన్నె పెట్టొచ్చు.  ఈ టేబుల్ దగ్గర కూడా దీపాలు పెట్టడం మర్చిపోవద్దు. 
     
  • ఇంటి మెయిన్ డోర్ ను ప్రత్యేకంగా అలంకరించాలి. మామిడి తోరణాలు, బంతిపూల దండలతో అలంకరించుకోవచ్చు.  దర్వాజతో డోర్ నిండుగా పూలతో డెకరేట్ చేయొచ్చు.  అవసరమైతే తీగలాంటి మనీ ప్లాంట్ మొక్కల్ని టెంపరరీగా గుమ్మం దగ్గర సెట్ చేయాలి.
     
  • అందరి ఇంట్లో ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి. అయితే ఈ సారి శుభ్రంగా కడిగి డెకరేట్ చేసుకోవచ్చు. గాజు సీసాలు లేదా వాటర్ బాటిల్స్ లో చిన్న చిన్న లైట్స్ పెట్టి కిటికీల దగ్గర లేదా ఇంటి బయట వాల్ మీద పెడితే బాగుంటుంది.