యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా రాత్రి ప్రధానాలయ మాడవీధుల్లో దివ్యవిమాన రథోత్సవం నిర్వహించారు. ఉదయం శ్రీమహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై విహరించిన లక్ష్మీసమేత నారసింహుడు.. సాయంత్రం దివ్యరథంలో ఆసీనుడై భక్తులను కనువిందు చేశారు. రథం ముందు చేసిన చెక్క, చిడత భజనలు, కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రథోత్సవం ముగిసే వరకు రథం ముందు యువకులు చేసిన డాన్సులు ఆనందపరవశుల్ని చేశాయి. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాన్ని జరపనున్నారు.
యాదగిరిగుట్టలో వైభవంగా దివ్యవిమాన రథోత్సవం
- నల్గొండ
- March 20, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.