సూర్యాపేట, వెలుగు : హైదరాబాద్ -– విజయవాడ నేషనల్ హైవేపై నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కారణంగా జనగాం ఎక్స్ రోడ్డు వద్ద నేటి నుంచి వాహనాలను దారి మళ్లించనున్నట్లు డీఎస్పీ రవికుమార్ తెలిపారు. సోమవారం సూర్యాపేట జనగాం ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలను దారిమళ్లించాల్సిన రూట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జనగాం నుంచి సూర్యాపేటకు వచ్చే రోడ్డు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొనసాగనున్న నేపథ్యంలో ఆ దారిని క్లోజ్చేసి వాహనాలను దారిమళ్లించనున్నట్లు తెలిపారు.
జనగాం వెళ్లాల్సిన ప్రయాణికులు మెడికల్ కాలేజీ నుంచి పిల్లలమర్రి సర్వీస్ రోడ్డు వద్ద యూ టర్న్ తీసుకోవాలని చెప్పారు. జనగాం నుంచి సూర్యాపేటలోకి ఎంటర్ కావడానికి వజ్ర టౌన్షిప్నుంచి అంజనాపూర్ కాలనీ రోడ్ వైపు వాహనాలను దారి మళ్లించినట్లు తెలిపారు. ఫ్లై ఓవర్నిర్మాణ పనులు పూర్తయ్యేవరకు వాహనదారులు సహకరించాలని కోరారు.