ఆర్మూర్లో సాఫ్ట్ బాల్ బాలుర జట్టు ఎంపిక

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​ సోషల్​ వెల్ఫేర్​రెసిడెన్షియల్​ స్కూల్​ గ్రౌండ్​లో గురువారం జిల్లా సబ్​జూనియర్​ సాఫ్ట్​ బాల్​ బాలుర ప్రాబబుల్స్​జట్టు ఎంపిక  పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన30 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి.ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్ తెలిపారు.

ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చి ఈనెల చివరి వారంలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు పంపుతామన్నారు. కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ సాయన్న, ఉపాధ్యాయులు గంగాధర్, అకాడమి కోచ్ నరేశ్, పీఈటీలు జ్ఞానేశ్వర్, సంతోష్, రాజేందర్ పాల్గొన్నారు.