వడ్లను రైస్ మిల్లులకు తొందరగా పంపండి : డాక్టర్​ ఏ.శరత్

నిజామాబాద్​, వెలుగు : జిల్లాలో యాసంగి సీజన్​ వడ్లు 4.33 లక్షల టన్నులు కొనుగోలు చేశామని, రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను గవర్నమెంట్​ కొంటుందని జిల్లా స్పెషల్​ ఆఫీసర్​ డాక్టర్​ ఏ.శరత్​ తెలిపారు. ఆలస్యంగా నాటు వేసిన కొన్ని ఏరియాలకు చెందిన వడ్లు ఉన్నందున 25 సెంటర్లు నడుపుతున్నామన్నారు. గరిష్టంగా మూడు రోజుల్లో మొత్తం కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు.

అన్నదాతల వద్ద మరో 5,500 టన్నుల వడ్లు ఉన్నట్లు అంచనా వేశామని వివరించారు. మంగళవారం ఇందల్వాయి మండలంలో కొనుగోలు సెంటర్​ను విజిట్​ చేసిన ఆయన రైతులతో మాట్లాడారు. నిజాంసాగర్​ ఆయకట్టు పరిధిలోని పడ్కల్, డొంకేశ్వర్​లో నాట్లు ఆలస్యంగా వేశారని మిగితా చోట్ల కోతలు ముగిశాయన్నారు.

కొనుగోలు చేసిన వడ్లను లారీలలో  రైస్​ మిల్లులకు పంపి  వేగంగా అన్​లోడ్​ చేయించాలని రైతులకు బిల్లులు స్పీడ్​గా అందేలా చూడాలన్నారు. ఏ ఒక్క రైతు నుంచి ఫిర్యాదు రావడానికి వీలులేదన్నారు. అదనపు కలెక్టర్​ కిరణ్​కుమార్​, డీఎస్​వో చంద్రప్రకాశ్, సివిల్ సప్లై స్ డీఎం జగదీశ్ తదితరులున్నారు.