బోధన్, వెలుగు: బోధన్మండలంలోని బర్దిపూర్, లంగ్డాపూర్ అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను జిల్లా పంచాయతీ అధికారి సీహెచ్.తరుణ్‌కుమార్ తనిఖీ చేశారు. పాఠశాలలో చేపట్టిన పనులు సక్రమంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పారిశుద్ధ్య పనులు తనిఖీలు చేశారు.
గ్రామాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. వర్షాకాలం కావడంతో దోమలు పెరిగే అవకాశం ఉండడంతో ఎప్పటికపుడు క్లీన్చేయలన్నారు. దోమలు పెరిగితే మలేరియా, డెంగీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. పారిశుద్ధ్య పనులు క్లీన్ చేయకపోతే చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు సూచించారు. వారి వెంట ఇంచార్జి డీఎల్ పీవో మధుకర్, ఎంపీడీవో బాల గంగాధర్, ఏపీవో హేమలత, పంచాయతీ కార్యదర్శి సద్గుణ, గ్రామస్తులు ఉన్నారు.