నిజామాబాద్ లో ఘనంగా జిల్లా స్థాయి ఇన్​స్పైర్ అండ్​ సైన్స్ ఎగ్జిబిషన్​

వెలుగు ఫొటోగ్రాఫర్,నిజామాబాద్​ : నిజామాబాద్ ఎస్ఎఫ్ఎస్ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి జిల్లా స్థాయి ఇన్​స్పైర్, సైన్స్ ఎగ్జిబిషన్​నిర్వహించారు. ఇందులో 126 ఎగ్జిబిట్లను విద్యార్థులు ప్రదర్శించారు. జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమానికి సంబంధించి 410 ఎగ్జిట్లతో విద్యార్థులు వారి గైడ్ టీచర్లు పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి,  అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ,  జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్, డీఈవో అశోక్ హాజరయ్యారు.  ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ గా పింటూ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్  వ్యవహరించారు.  సైన్స్ ఎగ్జిబిషన్​లు విద్యార్థుల్లో ఉత్సాహం, సృజనాత్మకతను పెంచుతాయన్నారు.