మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

సూర్యాపేట, వెలుగు: పేదవారికి ప్రభుత్వ హాస్పిటల్​లో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ని ఆయన  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ  సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ హాస్పిటల్ కు వస్తున్నారని, వారి నమ్మకాన్ని నిజం చేసేలా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ప్రభుత్వ హాస్పిటల్ లో సేవలు అందించాలని సూచించారు.

 మాత శిశు సంరక్షణ కేంద్రం పరిశీలించి ప్రసవాలు రోజు వారీగా, నెల వారీగా ఎన్ని అవుతున్నాయని సిబ్బందిని  తెలుసుకున్నారు. కేంద్రానికి వచ్చే పేషంట్ల వివరాలను ఆన్​లైన్​లో  నమోదు చేయాలని సూచించారు. సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకి వైద్య సేవలు అందించాలని అన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని అందుబాటులో లేని మెడీసీన్స్ ని ముందుగానే తెప్పించుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెసిడెన్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ సంధ్య, డాక్టర్ ప్రశాంతి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.