ఏప్రిల్ 25 నుంచి ఓటర్​ స్లిప్పుల పంపిణీ : జితేష్​వి పాటిల్

కామారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని ఓటర్లకు ఈ నెల 25 నుంచి మే 8 వరకు బూత్​లెవల్​ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి  ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నారని కలెక్టర్ జితేష్​వి పాటిల్​తెలిపారు. బుధవారం కలెక్టరేట్​లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఓటు వేసేందుకు ఓటర్లు ఆధారు కార్డు, పాన్​కార్డు,  బ్యాంక్​పాసు బుక్,  డ్రైవింగ్​ లైసెన్స్, ఉపాధి హామీ స్కీమ్​కార్డు వంటి వాటిలో ఏదైనా ఒక దానిని వెంట తీసుకురావాలని చెప్పారు.

 రాజకీయ పార్టీల నేతలు పర్మిషన్​ లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎలక్షన్​వింగ్​ఆఫీసర్లు అనిల్​కుమార్, నరేందర్, ​లీడర్లు పాల్గొన్నారు.