ఇంటింటికీ కాషాయ జెండాల పంపిణీ

నవీపేట్, వెలుగు : రామనవమి  సందర్భంగా  మండంలోని పలు గ్రామాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు కాషాయ​ జెండాలు, పూజ సామగ్రి పంపిణీ చేశారు.   అనంతరం ఆయన మాట్లాడుతూ  అయ్యోధ్య లో రామ మందిరం నిర్మాణం తర్వాత ప్రపంచం వ్యాప్తంగా వేడుకలను ఘనంగా  నిర్వహించుకోబోతున్నామన్నారు.  కార్యక్రమంలో  బీజేపీ  నాయకులు భూషణ్, రాజేందర్ గౌడ్, కరుణాకర్   తదితరులు పాల్గొన్నారు.