కరీంనగర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గలో సీఎంఆర్ఎఫ్​ చెక్కుల పంపిణీ

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ పరిధిలోని 117 కుటుంబాలకు సుమారు రూ.27.73లక్షల విలువైన సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌  చెక్కులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ తన క్యాంప్ ఆఫీస్‌‌‌‌లో మంగళవారం పంపిణీ చేశారు. ఆయన వెంట మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కార్పొరేటర్లు  ఐలేందర్ యాదవ్, రాజశేఖర్, శ్రీనివాస్,  లీడర్లు గంధె మహేశ్, బాలయ్య,  కృష్ణ, సంపత్ రావు, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.