జగిత్యాలలో వృద్ధులకు బట్టల పంపిణీ

జగిత్యాల టౌన్, వెలుగు : జగిత్యాల టీఆర్ నగర్ గల శ్రీ గాయత్రి విశ్వకర్మ వృద్ధాశ్రమంలో దసరా, బతుకమ్మ సందర్భంగా స్థానిక డాక్టర్లు కొత్త బట్టలు, పండ్లు, పిండి వంటకాలు పంపిణీ చేశారు. వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్లు పద్మా రాథోడ్, గూడూరు శ్రీలత, వోడ్నాల రజిత, రాచకొండ నాగరత్న,  ఆశ్రమ నిర్వాహకులు టీవీ సూర్యం, లక్ష్మణ్ పాల్గొన్నారు.