ఆర్మూర్ లో ఉచితంగా స్టూడెంట్స్ కు సైకిళ్ల పంపిణీ

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిరుపేద స్టూడెంట్స్​కు సైకిళ్లు పంపిణీ చేశారు. రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్​ గవర్నర్ హన్మంత్​రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూళ్లలో చదివే బాలికలు దూరభారం వల్ల తమ చదువులను మానుకోవద్దనే ఉద్ధేశంతో రూ.50,000 విలువైన సైకిళ్లను పంపిణీ చేసినట్లు చెప్పారు.

రోటరీ క్లబ్ హైదరాబాద్​ నార్త్​రీజియన్ ఆర్థిక సహకరం అందించిందన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్​రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పట్వారి గోపి కృష్ణ, సెక్రటరీ పట్వారి తులసి, పద్మ మురళీ, విజయ సారథి, చరణ్ రెడ్డి, పుష్పకర్ రావు, లింగాగౌడ్, నరేందర్, గోనె దామోదర్, ఎల్. కే.రాజు, రాస ఆనంద్, చౌటి లింబాద్రి, ఖాందేశ్ సత్యం, గోనె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.