ఎడపల్లిలో పెన్షన్​ ఇప్పిస్తానని మోసం

ఎడపల్లి, వెలుగు:  వికలాంగ పెన్షన్​ కోసం పోస్టాఫీసుకు వచ్చిన ఓ దివ్యాంగుడికి రూ.6 వేల పెన్షన్​ ఇప్పిస్తానని ఆశ చూపి గుర్తు తెలియని వ్యక్తి రూ. 4 వేలు కాజేసిన సంఘటన  మంగళవారం ఎడపల్లి  మండల కేంద్రంలో జరిగింది.  వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గుండారం నడ్పి సాయిలు దివ్యాంగుడు.  పెన్షన్​ తీసుకోవడానికి మంగళవారం పోస్టాఫీసుకు వచ్చారు. పెన్షన్​తీసుకున్న అనంతరం డబ్బులను లెక్క పెడుతుండగా ఆయనతో గుర్తు తెలియని వ్యక్తి మాట కలిపాడు.  

సాయిలుకు రూ.6 వేల పెన్షన్​ ఇప్పిస్తానని నమ్మబలికి అతడిని తహసీల్దార్​ కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ నకిలీ బ్యాంక్​ ఓచర్ పై సంతకాలు తీసుకున్నాడు.  సాయిలు వద్ద వున్న రూ.4 వేలు తీసుకొని రూ.6 వేలు తీసుకొస్తానని చెప్పి ఉడాయించాడు. నగదు తీసుకెళ్లిన వ్యక్తికోసం నిరీక్షింస్తుండడం గమనించిన స్థానికులు వివరాలు అడగడంతో జరిగిన విషయం చెప్పారు.   సాయిలు తాను మోసపోయానని గ్రహించి  ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.