మానేరుపై తెగిన మట్టి రోడ్డు 

ముత్తారం, వెలుగు: ముత్తారం మండలం ఓడేడ్​ గ్రామ సమీపంలో మానేరు నదిపై వేసిన మట్టి రోడ్డు కొట్టుకపోయింది. దీంతో పెద్దపల్లి–భూపాలపల్లి జిల్లాల మధ్య శనివారం రాకపోకలు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. రెండు జిల్లాలను కలుపుతూ మానేరుపై నిర్మించిన బ్రిడ్జి ఇటీవల కూలిపోయింది.

దీంతో  కొందరు మానేరులో తాత్కాలికంగా మట్టి పోయడంతో రాకపోకలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు మానేరులో నీరు పెరిగి మట్టి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి.