కాంగ్రెస్‌‌‌‌లో చేరిన బుడిమి సొసైటీ డైరెక్టర్లు

బాన్సువాడ, వెలుగు : బీఆర్ఎస్‌‌‌‌ పార్టీకి బాన్సువాడ మండలం బుడిమి సొసైటీ  చెందిన డైరెక్టర్లు ఐదుగురు గురువారం బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి , మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. డైరెక్టర్లు నారాయణ, విఠల్, బాలరాజు, మరియమ్మ, నాయకులు కొయ్యగుట్ట నగేశ్‌‌‌‌, రవికిరణ్‌‌‌‌,  పెద్దల్లో రవి,  హనీఫ్

ఖాజా, చిలకమూరి రవి,  జిన్న రవీందర్ తదితరులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.  కార్యక్రమంలో బుడిమి సొసైటీ ఉపాధ్యక్షులు మధుసూధన్ రెడ్డి, మాజీ చైర్మన్ సాయగౌడ్, అంబర్ సింగ్, లయక్ తదితరులు పాల్గొన్నారు.