మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో జువెలరీ షాపులు సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మెట్ పల్లి, వెలుగు: గోల్డ్  స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగస్వామ్యం ఉందనే అనుమానంతో మెట్ పల్లి పట్టణంలోని బంగారు దుకాణాలను  డైరెక్టరేట్ ఆఫ్  రెవెన్యూ  ఇంటెలిజెన్స్  హైదరాబాద్​ అధికారులు సీజ్  చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలో కొన్నేండ్లుగా బంగారం వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారికి స్మగ్లింగ్  ముఠాతో సంబంధాలు ఉన్నాయని, వారితో కలిసి నిబంధనలకు విరుద్ధంగా గోల్డ్​ రవాణా చేస్తున్నారనే అనుమానంతో డీఆర్ఐ ఆఫీసర్లు గత నెల 28న మెట్ పల్లి కూరగాయల మార్కెట్  సమీపంలోని దుకాణాలను తనిఖీ చేసినట్లు సమాచారం.

వీరి వద్ద సుమారు 5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. షాపు యజమాని లేకపోవడంతో వర్కర్లతో మాట్లాడి పలు విషయాలపై ఆరా తీసినట్లు తెలిసింది. యజమానికి ఫోన్  చేసినా స్పందించకపోవడంతో 3 షాపులను సీజ్ చేశారు. అనంతరం షాపు గోడలపై నోటీసులు అతికించారు. దీంతోపాటు రెండు నెలల కింద మెట్ పల్లికి చెందిన ఓ వ్యాపారి కారులో గోల్డ్​ తీసుకొస్తుండగా, కర్నాటక బార్డర్ లో పోలీసులు పట్టుకున్నారు.

జిల్లాకు చెందిన ఓ అధికారి అక్కడి అధికారితో మాట్లాడి సెటిల్​మెంట్  చేసి పట్టుబడిన బంగారం విడిపించినట్లు ప్రచారం జరిగింది. కాగా డీఆర్ఐ పోలీసులు దుకాణాలను  సీజ్  చేయడం పట్టణంలో కలకలం రేపింది. ఈ విషయమై స్థానిక పోలీసులను సంప్రదించగా బంగారం దుకాణాల సీజ్  విషయం తమకు తెలియదని చెప్పడం గమనార్హం.