ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ (DG) రాకేశ్ పాల్ గుండెపోటుతో మృతి

చెన్నై: ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ (DG) రాకేశ్ పాల్ గుండెపోటుతో మృతిచెందారు. ఆదివారం (ఆగస్టు 18) రాకేశ్ పాల్ కు గుండెపోటు రావడంతో చెన్నై లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే రాకేశ్ పాల్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దివంగత డీఎంకే నేత కరుణానిధి జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణెం విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నా రాకేశ్ పాల్.. గుండెపోటుకు గురికావడంతో అక్కడినుంచి రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..రాకేశ్ పాల్ చనిపోయినట్లు వెల్లడించారు. 

ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ (DG) రాకేశ్ పాల్ గుండెపోటుతో మృతి

రాకేశ్ పాల్ 34 సంవత్సరాలుగా  సుదీర్ఘ సముద్ర అనుభవాన్ని కలిగి ఉన్నాడు. సమర్త్, విజిత్, సుచేత కృప్లానీ, అహల్యాబాయి , C-03 అనే అన్ని రకాల ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలకు రాకేశ్ పాల్ నాయకత్వం వహించాడు. సముద్ర రక్షణ రంగంలో కీలక భూమిక పోషించారు. అనేక మంది కోస్ట్ గార్డ్ సిబ్బందినియామకాలు చేపట్టారు. 

రాకేశ్ పాల్ ఆకస్మిక మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం X ద్వారా ఇండియన్ కోస్ట్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. భారత సముద్ర భద్రతను పటిష్టం  చేయడంలో డీజీ  రాకేశ్ పాల్ సమర్థవంతంగా పనిచేశారని, నిబద్ధత కలిగిన అధికారి అని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. రాకేష్ పాల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.