కొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా

సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ 2024-–25 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సులో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. 

సీట్లు: యూనివర్సిటీ పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు-120; అనుబంధ పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు- 200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుంబంధ పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 60 శాతం సీట్లను గ్రామీణ విద్యార్థులకు, 40 శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత లేదా ఇంటర్మీడియట్ ఫెయిలైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ పాలిసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2024 ఉత్తీర్ణులై ఉండాలి. 31 డిసెంబర్​ 2024 నాటికి వయసు 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: పాలిసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2024 ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పదో తరగతి మార్కుల ఆధారంగా సీటు కేటాయిస్తారు. జులై 15 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600. మిగతా అభ్యర్థులందరికీ రూ.1100 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. వివరాలకు www.skltshu.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.