ప్రపంచాన్ని వణికిస్తున్న డింగా డింగా వైరస్.. ఎవరెవరికి వస్తుంది.. ఎలా వ్యాపిస్తుంది.. దీని లక్షణాలు ఏంటీ..?

డింగా డింగా వైరస్..ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్..ఈ వైరస్ సోకితో బాధితులు వింతవింత చేష్టలతో ప్రవర్తిస్తారు. నియంత్రణలేని షేకింగ్ తో ఊగిపోతుం టారు..ఇది డ్యాన్స్ చేసినట్లుగానే ఉంటుంది. ఉన్నట్టుండి పడిపోతారు..నడవలేరు. ఈ వింత రోగం డింగా డింగా..ఉగాండా దేశంలో ప్రజలను పట్టి పీడిస్తోంది. ఇది గనక వ్యాప్తి చెందితే ప్రపంచ మంతా డ్యాన్స్ చేయాల్సిందే అంటున్నారు అక్కడి ఆరోగ్య నిపుణులు. 

ఉగాండాలోని బుండిబుగ్యో అనే ప్రాంతంలో డింగా డింగా వైరస్ సోకి ప్రజలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా మహిళలు, బాలికలకు ఈ వ్యాధి సోకుతోంది. ఇక దీని లక్షణాలు శరీరంలో పెద్దగా వణుకు, జ్వరం, ఆ తర్వాత బలహీన పడటం. 

శరీరంలో వణుకు వచ్చినప్పుడు అదో రకం డ్యాన్స్ చేసినట్టే ఉంటుందని ఉగాండా హెల్త్ అఫీషియల్స్ చెబుతున్నారు. ఈ వైరస్ ను 1518లో ఫ్రాన్స్ లోని స్ట్రాస్ బర్గ్ లో వచ్చిన డ్యాన్సింగ్ ప్లేగుతో పోలుస్తున్నారు అక్కడి ఆరోగ్య అధికారులు. 

బుండిబుగ్యోలో ఇప్పటివరకు దాదాపు 300 కేసులు నమోదయ్యాయి. ఎటువంటి మరణాలు సంభవించలేదు , చాలా మంది రోగులు సరైన చికిత్సతో వారంలోపు కోలుకుంటున్నారని అక్కడి హెల్త్ అఫీషియల్స్ చెబుతున్నారు. 

డింగా డింగా వ్యాధికి కారణాలు ..

డింగా డింగా అనారోగ్యానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా బయటికి రాలేదు గానీ.. కొంతమంది ఇది వైరస్ వల్ల కలుగుతుందని భావిస్తున్నారు. మరికొందరు పరిశోధకులు పర్యావరణ కారకాలు అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

డింగా డింగా వైరస్ లక్షణాలు..

  • నియంత్రణలేని వణుకు: డ్యాన్స్ చేసినట్లు శరీరం నియంత్రించలేకుండా కదలడం ప్రధాన లక్షణాలు. 
  • జ్వరం అలసట: చాలా మంది రోగులు అధిక జ్వరం, చాలా బలహీనంగా మారడం. 
  • కొంతమంది వ్యక్తులు పక్షవాతం వంటి లక్షణాలను ఎదుర్కొంటూ నడవలేనిస్థితిలోకి వెళ్లడం.