భారంగా మిడ్​ డే మీల్స్

  •  గత అక్టోబర్​  నుంచి నిలిచిపోయిన కోడిగుడ్ల బిల్
  • నవంబర్​ నుంచి 9, 10 స్టూడెంట్స్​ బిల్స్​ బకాయి
  • వంటవారి గౌరవ వేతనం కూడా అంతే..
  • ప్రతి నెలా రూ.కోటిన్నర అప్పుతో ఏజెన్సీల నిర్వహణ ఎలా..?

నిజామాబాద్​, వెలుగు : జిల్లాలో సర్కారు, ఎయిడెడ్​ బడులకు మిడ్​ డే మీల్స్​ రెడీ చేసే ఏజెన్సీలు అప్పుల పాలవుతున్నాయి. కుటుంబ పోషణ కోసం ఉపాధిగా ఎంచుకున్న వంటలు  వడ్డీల భారం మోపుతున్నాయి. గవర్నమెంట్​ నుంచి క్రమంగా బిల్స్​ రాకపోవడంతో నిర్వహణ భారంగా మారుతోంది. బీఆర్​ఎస్​ గవర్నమెంట్​ హయాంలో నిర్లక్ష్యానికి గురైన బిల్లులను కాంగ్రెస్​ సర్కారు రూ.5 కోట్ల దాకా చెల్లించినా ఇంకా మొత్తం క్లియర్​ కాలేవు

ఇంకా రావాల్సింది రూ.5 కోట్లు

జిల్లాలోని 1,234 స్కూల్స్​లో 1.02 లక్షల స్టూడెంట్స్​ కోసం మిడ్​డే మీల్స్​ స్కీం కొనసాగుతోంది. 1,164 ఏజెన్సీల కింద మొత్తం 2,524 మంది వంటవారు, సహాయకులు ప్రతి రోజూ వంట పనిలో నిమగ్నమవుతున్నారు. ఒకటి నుంచి ఐదు క్లాస్​ల దాకా ఒక స్టూడెంట్​కు రూ.5.45, 6 నుంచి 8 క్లాస్​ విద్యార్థులకు రూ.8.17 చొప్పున, తొమ్మిది​, పది​ పిల్లలకు రూ.10.67 చొప్పున ఏజెన్సీలకు గవర్నమెంట్​ డబ్బులు చెల్లిస్తుంది. మార్కెట్​లో పప్పు, నూనె, కారం, కూరగాయల రేట్లు పెరిగినా ఈ రేట్లలో ఎలాంటి తేడా ఉండదు. అటెండెన్స్​ ఆధారంగా స్టూడెంట్స్ ఎంత మంది భోజనం చేసిన వివరాలు ఏరోజుకారోజు హెచ్​ఎంల ద్వారా ఎండీఎం యాప్​లో నమోదై బిల్​ రెడీ అవుతుంది.  పౌష్టికాహారం కింద వారంలో మూడు రోజులు కోడిగుడ్డు విధిగా పెట్టాలి.

గవర్నమెంట్​ ఇందుకు ప్రతి గుడ్డుకు రూ.5 చెల్లిస్తుంది. 1-8 క్లాస్​ల దాకా విద్యాహక్కు చట్టం కింద సెంట్రల్​ గవర్నమెంట్​ ఎండీఎం ఖర్చులో 60 శాతం డబ్బును స్టేట్​కు పంపుతుంది. 9, 10 క్లాస్​ స్టూడెంట్స్​ ఎండీఎం భారమంతా రాష్ట్రానిదే. సెంట్రల్​ గవర్నమెంట్​ వాటా సొమ్ము గత బీఆర్​ఎస్​ పాలకులకు అందినా ఏజెన్సీలకు చెల్లించక తిప్పలు పెట్టారు.  ఏడు నెలల బాకీ బిల్ రూ.5 కోట్ల మేరకు కాంగ్రెస్​ ప్రభుత్వం ఏప్రిల్​లో చెల్లించింది.

అయితే గత నవంబర్​ నుంచి బకాయి ఉన్న రూ. కోటిన్నర 9, 10 క్లాస్ స్టూడెంట్స్​ బిల్లు, గత అక్టోబర్​ నుంచి రూ.కోటిన్నర కోడిగుడ్ల పైసలు, జూన్​, జులై నెలల వంట మనుషుల గౌరవ వేతనం సొమ్ము కలిపి మొత్తం రూ.5 కోట్ల డబ్బు ఇంకా రావాల్సి ఉంది.  ఈ మేరకు డబ్బు చెల్లింపులు ఆగిపోవడం ఏజెన్సీలకు భారంగా మారింది.

ఎండీఎంపై ఎఫెక్ట్​

బిల్స్​ నిలుపుదల మిడ్​డే మీల్స్​ క్వాలిటీపై డైరెక్ట్​ ఎఫెక్ట్​ చూపుతోంది. స్టూడెంట్స్​కు బాయిల్డ్​ ఎగ్స్​ ఇవ్వడం దాదాపు ఆపేశారు. మార్కెట్​ గుడ్డు ధర రూ.6 ఉండగా సర్కారు రూ.5 ఇవ్వడం గిట్టుబాటుకావడంలేదని ఏజెన్సీలు అంటున్నాయి. నిత్యావసర సరుకులు మార్కెట్​ ప్రైస్​ ప్రకారం ఇవ్వాలని కోరుతున్నారు. కాంపౌండ్​ వాల్స్​ ఉన్న స్కూల్​గ్రౌండ్​లో బెండ, దొండ, బీర, సొరకాయ

టమాట, పెంచాలనే ప్రతిపాదనలు గతంలో వచ్చినా ఆచరణలో పెట్టలేదు. అమ్మబడి పేరుతో సర్కారు బడుల మేనేజ్​మెంట్​ బాధ్యతలు మహిళా సంఘాలకు ఇచ్చినందున ఆ దిశగా ఆలోచిస్తే ప్రయోజనం ఉండే చాన్స్​ ఉంది. 

 చాలా కష్టంగా ఉంది

మిడ్​డేమీల్స్​ ఖర్చు ప్రతినెలా సుమారు రూ.కోటిన్నర ఉంటది. ఒక్కనెలా పేమెంట్​ ఆగినా అంత భారం ఏజెన్సీలపై పడుతుంది. వడ్డీలకు డబ్బు తెచ్చి వంటలు చేస్తూ అప్పులపాలవుతున్నం. కాంగ్రెస్​ గవర్నమెంట్​ వచ్చాక ఉద్యోగులకు ఠంచన్​గా ఒకటో తేది జీతాలు చెల్లిస్తున్నట్లు మాకూ ఇవ్వాలి. ఎండీఎం రేట్లు పెంచకుంటే ఏజెన్సీలు నష్టపోతాయి.

తోపునూరి చక్రపాణి, ఎండీఎం ఏజెన్సీల సంఘం జిల్లా ప్రెసిడెంట్