పంటల సాగుకు రైతులు పడరాని పాట్లు పడతారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ కు చెందిన ఓ రైతు తన భూమిలో ఉన్న రాళ్లను తొలగించి పంట సాగు చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఉన్న 2 ఎకరాల్లో పూర్తిగా రాళ్లు ఉండడంతో..
దున్నటానికి అడ్డువచ్చాయి. దీంతో 4 రోజులుగా తన ఇంటి మనుషులు ముగ్గురితో పాటు మరో నలుగురు కూలీలను పెట్టి రాళ్లను ఏరివేస్తునట్లు రైతు కొర్రి బాల్ తెలిపారు. - కామారెడ్డి, వెలుగు