అవీ ఇవీ :  కెఫెలో చేపల చెరువు 

మోడర్న్​ కెఫెలను రకరకాలుగా డిజైన్​ చేస్తుంటారు. కస్టమర్స్​ని అట్రాక్ట్​ చేయడానికి డిఫరెంట్ థీమ్స్​ పెడుతుంటారు. సముద్రం ఒడ్డున కెఫె చూసి ఉంటారు. కెఫెలో స్విమ్మింగ్ పూల్, పెద్ద పెద్ద అక్వేరియంలు చూసి ఉంటారు. కానీ...ఇలాంటి కెఫెను మాత్రం ఎప్పుడూ, ఎక్కడా చూసి ఉండరు. ఈ కెఫెకి వెళ్లారంటే నేరుగా ఫిష్​ అక్వేరియంలో అడుగుపెట్టినట్టే. అర్థం కాలేదా? మరేం లేదు.. కెఫెలోకి వెళ్లాక వేసే అడుగు ఫ్లోర్​ మీద కాకుండా నీళ్లలో పడుతుంది. ఆ నీళ్లలో రంగురంగుల చేపలు అటుఇటు తిరుగుతుంటాయి. ఆ నీళ్లలో చేపల మధ్యలో అక్కడక్కడా డైనింగ్ టేబుల్స్, చెయిర్స్ ఉంటాయి. ఈ కెఫెకి వెళ్లిన కస్టమర్స్ చేపలతో ఆడుకుంటూ ఫుడ్​ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంత వెరైటీ ఐడియా ఎవరికొచ్చింది? ఈ కెఫె ఎక్కడుంది? ఆ వివరాలే ఇవి...

థాయి​లాండ్​కి చెందిన యొసఫొల్​ జిట్మంగ్​ అనే అతను ‘స్వీట్ ఫిష్స్​ కెఫె’ పెట్టాడు. ఈ కెఫెలో ‘కొయి’ రకం చేపలు నీళ్లలో స్విమ్​ చేస్తూ వెల్​కం చెప్తాయి. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ చేపలతో ఫొటోలు, వీడియోలు తీసుకుంటుంటారు. అలాగే ఓ కస్టమర్​ దీన్ని సోషల్​ మీడియాలో పోస్ట్ చేసింది. కెఫె ఓనర్​ని ఈ ఆలోచన వెనక ఏదైనా కారణం ఉందా అని అడిగితే.. ‘హొ చి మిన్స్​ అనే వ్యక్తి ‘అమిక్స్ కాఫీ’ పేరుతో ఇలాంటి కెఫె పెట్టాడు.

దాన్ని చూశాక నేను కూడా అలా పెడితే బాగుంటుంది అనిపించింది. అందుకే ఇలా డిజైన్​ చేశా’ అన్నాడు. అంతేకాదు.. నీళ్లని ఫిల్టర్​ చేయడానికి నలుగురు వర్కర్స్​ 24 గంటలు పనిచేస్తుంటారు. రోజుకి రెండు సార్లు నీళ్లు మారుస్తారు. ఇందులో పని చేసే స్టాఫ్​ ప్రతి కస్టమర్​ని జాగ్రత్తగా గమనిస్తారు. కస్టమర్ల పాదాలను శుభ్రం చేస్తారు. చేపల్ని ముట్టుకోవద్దని, డిస్టర్బ్ చేయకూడదని కెఫెలోకి అడుగుపెట్టే ముందే చెప్తారు.

కొయి రకం చేపలు రంగురంగుల్లో ఉంటాయి. అందుకే వాటిని కెఫెలో పెట్టా. చేపలు ఉన్న నీళ్లలో కాళ్లు పెడితే పాదాలను కొరుకుతాయి అనే డౌట్​ వస్తుంది ఎవరికైనా. అయితే ఈ కొయి రకం చేపలు జనాల్ని చూసినా లేదా డెడ్ స్కిన్ చూసినా రియాక్ట్ కావు. అయితే ఈ కెఫె పెట్టిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా. యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్​లు రెండు నెలలు కెఫెని క్లోజ్​ చేయించారు. నాలాగానే అమిక్స్ కాఫీ కెఫెకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందులన్నీ దాటుకుని కెఫె నడుపుతున్నాం” అని చెప్పాడు స్వీట్​ ఫిష్స్ కెఫె యజమాని యొసఫొల్​.