ప్రపంచ వ్యాప్తంగా తిరుమల ఎంతో గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. తిరుమలకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల కొండలకు .. ఆ స్థలానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి. అలానే ఇప్పుడు అయోధ్య కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా సంతరించుకుంది. రామ జన్మభూమి అయోధ్య చరిత్ర ఏంటి.. దానికి ఆపేరు ఎలా వచ్చింది.. తిరుమలకు... అయోధ్యకు ఉన్న విశిష్టతలు ఏంటి.. ఆ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. . . .
తిరుమల గురించి..
తిరుమల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని నమ్ముతారు. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్వహిస్తుంది.
తిరుమల కొండలు శేషాచలం కొండలు పరిధిలో భాగం. కొండలు సముద్ర మట్టానికి పైన 853 metres (2,799 ft) ఎత్తులో ఉన్నాయి. కొండలశ్రేణిలోగల ఏడు శిఖరాలు, ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయి. ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున ఏడవ శిఖరం వెంకటాద్రిపై ఉంది. అందువల్ల ఈ ఆలయాన్ని "ఏడు కొండల ఆలయం" అని కూడా పిలుస్తారు.
తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తోండైమండలం తమిళ పాలకుడు తొండమాన్ సా.శ. 8 వ శతాబ్దంలో గాలిగోపురం, ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు.ఈ ఆలయం వైఖానస ఆగమ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఇది ఎనిమిది విష్ణు స్వయంభు క్షేత్రాలలో ఒకటి. ఇది 108 దివ్యదేశాలలో చివరి భూసంబంధమైన దివ్యదేశంగా 106 స్థానంలో ఉంది. ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీని నిర్వహించడానికి రెండు ఆధునిక వేచివుండే (క్యూ) భవనాలు ఉన్నాయి. ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజనం కోసం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనం, తలనీలాలు సమర్పించు భవనాలు, అనేక యాత్రికుల బస స్థలాలు ఉన్నాయి.
అయోధ్య చరిత్ర
అతిపురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. రామాయణంలో ఈ నగరవైశాల్యం 250 చదరపు కిలోమీటర్లు (90 చదరపు మైళ్ళు ) గా వర్ణించబడింది. కోసలరాజ్యానికి రాజధాని అయోధ్య గంగానదీ తీరంలో సరయూనది కుడివైపున ఉన్నది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజైన ఇక్ష్వాకు కోసలరాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశరాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. దశరథుడి కుమారుడే శ్రీరాముడు.
వాల్మీకి విరచితమైన రామాయణ మాహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్యను మహోన్నతంగా వర్ణించాడు. అంతేకాక కోసల సామ్రాజ్యవైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, వారి సంపద, ప్రజల విశ్వసనీయత గురించిన గొప్ప వర్ణన ఉంది. తులసీదాసు తిరిగి రచించిన రామచరితమానస్‍లో అయోధ్య వైభవం వర్ణించాడు. కంబరామాయణంలో కూడా అయోధ్య గురించి అత్యున్నతంగా వర్ణించాడు. తమిళ వైష్ణవ భక్తులైన ఆళ్వారులు తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత, బహుబలి, సుందరి, పాడలిప్తసురీశ్వరి, హరిచంద్ర, అచలభరత మొదలైనవారు అయోధ్యలో జన్మించిన వారే.
అయోధ్య, బౌద్ధమత వారసత్వం కలిగిన నగరం. ఇక్కడ మౌర్యాచక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు, స్మారకనిహ్నాలు, శిక్షణాకేంద్రాలు ఉన్నాయి. గుప్తులకాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది. చరిత్రకారులు దీనిని సాకేతపురంగా పేర్కొన్నారు. క్రీ.పూ 5వ శతాబ్ద ప్రారంభం నుండి సా.శ. 5వ శతాబ్ధాంతం వరకు బౌద్ధమతకేంద్రంగా అయోధ్య విలసిల్లినది. బుద్ధుడు ఈనగరానికి ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చినట్లు భావిస్తున్నారు. స్వామినారాయణ మార్గ స్థాపకుడైన స్వామినారాయణుడు ఇక్కడ జన్మించాడని, ఏడు సంవత్సరాల అనంతరం నీల్కాంత్‍గా భారతదేశ సంచారానికి వెళ్లాడాని విశ్వసిస్తారు.
అయోధ్య నామ చరిత్ర
పురాణాలలో మహారాజైన ఆయుధ్ ను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం. గౌతమబుద్ధుని కాలంలో ఈ నగరం పాళీ భాష లో అయోజిహాగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్ధాన్ని ఇస్తుంది. పురాణాలలో గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది.
సామాన్య శకం మొదటి శతాబ్ధాలలో ఈ నగరాన్ని సాంకేతపురంగా పేర్కొన్నారు. సా.శ.127 సాంకేతపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది. కుషన్ చక్రవర్తి తూర్పుప్రాంతంనికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం ఫాక్సియన్ (పినియిన్: షాజి) అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి యువాన్ త్స్యాంగ్ సా.శ.636 లో తన భారతదేశ యాత్రలో ఈనగరాన్ని అయోధ్యగా పేర్కొన్నాడు. మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ్ స్థానంగా ఉండేది. బ్రిటిష్ పాలనాసమయంలో ఈనగరాన్ని అయోధ్య, అజోధియగా పేర్కొన్నారు . అలాగే అయోధ్య, బ్రిటిష్ వారి కేంద్రపాలిత ప్రాంతాలైన ఆగ్రా-అయుధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది.