లెటర్​ టు ఎడిటర్ : బెల్టు షాపులపై ప్రభుత్వ చర్యలేవి?

తాగుబోతుల రాష్ట్రంగా తయారైందని గత ప్రభుత్వాన్ని విమర్శించిన నేటి ప్రభుత్వ నాయకులు, అంతకు మించి అన్న చందంగా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. సార్వత్రిక ఎలక్షన్స్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా యథేచ్ఛగా నడుస్తున్నాయి. మద్యంతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్న దృష్ట్యా బెల్టు షాపుల కట్టడికి ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, లేదంటే రానున్న రోజుల్లో యావత్ రాష్ట్రానికే  ప్రమాదం.

-  దిడ్డి శ్రీకాంత్ 
జమ్మికుంట, కరీంనగర్ జిల్లా