Good Health : ఒక్కసారి షుగర్ వస్తే చాలు.. ఇన్ని అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి..!

ఒక ఇంటికి అంటుకున్న నిప్పు మిగతా ఇళ్లకు అంటుకున్నట్లే ఇన్సులిన్ సమస్య శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా చెడు ప్రభావం చూపుతది. డయాబెటిస్ రోగిలో ముందు కిడ్నీలపై ఈ ప్రభావం పడుతది. డయాబెటిస్ రోగి రక్తంలో షుగర్ అధికంగా ఉంటుంది. ఈ రక్తాన్ని ఫిల్టర్ చేసే గ్లోమరులస్ మీద భారం పడుతది.. కొంత కాలానికి అవి ఫెయిలవుతయి. కిడ్నీ ఫెయిల్యూర్​ తో  ఇంకొన్ని సమస్యలొస్తయి.. కిడ్నీ పనితీరు తగ్గితే కాళ్లు, ముఖం, పొట్టలో వాపులొస్తయి.

మధుమేహం వల్ల వచ్చే సమస్యలు 

  •  బ్లడ్ తయారీని ప్రేరేపించే హార్మోన్ కిడ్నీలో తయారవుతది. కిడ్నీలు ఫెయిలవడం మొదలైనప్పటి నుంచి రక్తహీనత (ఎనీమియా) ఉంటది.
  •  రక్తహీనత వల్ల శరీరంలో వాపులు (ఎడిమా) వస్తయి.
  •  రక్తనాళాలలో ఒత్తిడిని కలిగిస్తూ రక్త సరఫరాకు దోహదపడే 'ఆంజియోటెన్సిన్' కిడ్నీలలో తయారవుతది. ఇది తగ్గితే రక్తనాణాల్లో ఒత్తిడిపై నియంత్రణ పోతది. రక్తనాణాలు సంకోచిస్తయి.
  •  రక్త హీనత, రక్తనాణాల్లో ఒత్తిడిపై నియంత్రణ తగ్గి, బీపీ పెరుగుతది.
  •  రక్తహీనత, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల జీర్ణరసాల తయారీ తగ్గుతది. ఆహారం సరిగా జీర్ణం కాదు.
  •  మూత్రం ద్వారా పోవాల్సిన మాలిన్యాలు రక్తంలో పెరుగుతాయి. వీటివల్ల తలనొప్పి. డయాబెటిక్ రెటినోపతి వస్తది.
  •  బ్లడ్​ లో  యూరియా పెరిగితే.. వాంతులు. తలనొప్పి, ఫిట్స్, బ్రెయిన్​ కు సంబంధించిన సమస్యలు వస్తయి.
  • రక్తంలో నీటి శాతం (కీటోసిస్), యూరియా పెరుగుతయి.
  •  సోడియం పెరుగుదల వల్ల బీపీ (హైపర్ నాట్రేమియా) పెరుగుతది.
  •  కొన్నాళ్లకు కిడ్నీలు పూర్తిగా ఫెయిలవుతయి.

P3  ప్రాబ్లమ్స్

  • షుగరు వచ్చిందంటే మూడు సమస్యలొస్తయి.. వీటిని పీ 3 ప్రాబ్లమ్స్' అంటరు.
  • పాలీ యూరియా: మూత్రం ఎక్కువసార్లు రావడం
  • పాలీడిప్పియా అతిగా దప్పిక కావడం
  • పాలి ఫేజియా: ఆకలి ఎక్కువ అయితది. తిన్నా ఇంకా తినాలనిపిస్తది.
  • కొంతమందిలో ఈ మూడు లక్షణాలు ఉంటాయి.
  • ఉండకపోవచ్చు. కొన్నే ఉండొచ్చు కూడా.. ఏది ఏమైనా షుగర్​ వచ్చిందంటే.. రెగ్యులర్​ చెకప్​... రోజూ మందులు వాడటం.. డైట్​ కంట్రోల్​  కంపల్సరీ.  వీటన్నింటితో పాటు వ్యాయామం కూడా చేయాలి.


–వెలుగు, లైఫ్​–