హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్‌జీన్ బయోటెక్ లిమిటెడ్‌కు చెందిన నీడిల్‌ఫ్రీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధుమేహ రోగుల ఇంజెక్షన్లను స్ప్రే రూపంలో తెచ్చింది. దీనిని ముక్కు లేదా నోటి స్ప్రేగా వాడవచ్చు. ఈ కొత్త సాంకేతికతను రెండు దశాబ్దాల క్రితం ట్రాన్స్‌జీన్ బయోటెక్ లిమిటెడ్ ప్రారంభించింది. నీడ్‌ల్‌ఫ్రీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను తీసుకుంది.
ఈ డ్రగ్ వాడేటప్పుడు నొప్పి ఉండదు. మధుమేహం కోసం ఇన్సులిన్ వంటి వాటిని నోటి ద్వారా లేదా నాసికా స్ప్రేగా తీసుకోవవచ్చు. పాలమూర్ బయోసైన్స్అనే సంస్థ ఇటీవల కుక్కలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ ఓరల్ ఇన్సులిన్ బాగా పనిచేస్తున్నట్టు తేలిందని నీడిల్ ఫ్రీ తెలిపింది.