రెండు నెలలుగా జీతాలు పడలేదు..కామారెడ్డిలో కార్మికుల ధర్నా

కామారెడ్డి, వెలుగు :  రెండు నెలలుగా జీతాలు వేయకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని కామారెడ్డి మున్సిపల్ కార్మికులు వాపోయారు. మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్​ఆఫీస్​ఎదుట ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే స్పందించి పెండింగ్ జీతాలు ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. నెలనెలా ఇన్​టైంలో జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.

కుటుంబ ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోయారు. అయితే క్యాంప్​ఆఫీసులో ఎమ్మెల్యే లేరని, అక్కడి సిబ్బంది చెప్పారు. కార్మికులతో ఫోన్​లో మాట్లాడించారు. బుధవారం కమిషనర్​తో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.