కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

  • సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట నిరసన 

కామారెడ్డి టౌన్​, వెలుగు: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ ముందు బుధవారం ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్,  తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కందారపు రాజనర్సు మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ పే తదితర పద్ధతుల్లో ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారన్నారు.  

Also read : రూ.40 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు : దొంతి మాధవరెడ్డి

నూతన పీఆర్సీలో కనీస వేతనం రూ.26,000- లుగా నిర్ణయించాలని డిమాండ్​ చేశారు.  ధర్నా అనంతరం అదనపు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్, బాన్సువాడ రాజు సాయిలు, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బోకే జ్యోతి, విజయ్, నరసవ్వ, కందారం రాజమణి  తదితరులు పాల్గొన్నారు.