గోశాలపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి .. భువనగిరిలో ధర్నా

యాదాద్రి, వెలుగు : గోశాలపై దాడి చేసిన దుండగులను శిక్షించాలని డిమాండ్​ చేస్తూ సోమవారం భువనగిరిలో ధర్నా నిర్వహించారు. ఆలేరు మండలం బహదూర్​పేటలోని శ్రీ సారబుడ్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి  గోశాలపై ఇటీవల కొందరు వ్యక్తులు జేసీబీతో రెండుసార్లు దాడి చేసి ధ్వంసం చేశారు. దీనిపై ఆలేరు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. దీంతో భువనగిరిలో బీజేపీ,  బీఆర్ఎస్, విశ్వహిందూ పరిషత్, హిందూవాహిని, భజరంగ్ దళ్, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, శ్రీరామ్ సేన  ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్​ చేయాలన్నారు. అనంతరం డీసీపీ రాజేశ్ చంద్రను కలిసి వినతిపత్రం అందించారు. ధర్నాలో ఆయా పార్టీలు, సంఘాల లీడర్లు కందుల శంకర్, కర్రె ప్రవీణ్, తునికి దశరథ, జంపాల దశరథ, కుండె గణేశ్, శివ సాయి, మైదం భాస్కర్, పేరపు ఆనంద్, పాశికంటి సంపత్, దయ్యాల సంపత్, అయిలి సందీప్, కటకం వెంకటేశ్, మిట్టపల్లి భాస్కర్, మిట్టపల్లి వీరస్వామి, సంపత్, జూకంటి కృష్ణ, శివ, బాలనర్సయ్య, మల్లయ్య, నర్సయ్య, బీరప్ప  పాల్గొన్నారు.