ధర్మపురి ఆలయంలో భక్తుల కోలాహలం 

జగిత్యాల జిల్లా  ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (Sri Lakshmi Narasimha swamy Temple) ఆలయానికి భక్తులు పోటెత్తారు. దసరా పండుగ సందర్భంగా లక్ష్మీ నరసింహుడి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్లు నిండిపోయాయి. దీంతో నారసింహుని దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నది. దసరా సందర్భంగా వాహనాలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 

Also Read :- లక్ష్మీపురం స్కూల్​ను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం