పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ధర్మపురి ఎమ్మెల్యే సాగ్వతం

జగిత్యాల జిల్లా: పార్లమెంటులో ప్రమాణ స్వీకారం తర్వాత మొట్టమొదటిసారిగా ధర్మపురికి విచ్చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణకు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పార్టీ నాయకులు డప్పు వాయిద్యాలతో ఎంపీ గడ్డం వంశీ కృష్ణను ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయానికి తీసుకెళ్లారు. ముందుగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో, అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. తదనంతరం వారు ధర్మపురి పట్టణాల్లో వన మహోత్సవంలో పాల్గొంటారు.

Also Read : వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వాలి : మాల ప్రజా సంఘాల నాయకులు