ధర్మ సమాజ్​పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరహార దీక్ష

కామారెడ్డి టౌన్, వెలుగు : పేద, మధ్యతరగతి  ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, నివసించేందుకు ఇండ్లు అందించాలని డిమాండ్​ చేస్తూ  పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్​విశారదన్​మహరాజ్ ఆదేశాల మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్మసమాజ్​ పార్టీ  నాయకులు ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు.  

రాష్ర్ట నాయకులు లక్ష్మణ్​, రాజు మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఉచిత విద్యం, వైద్యం, ఇండ్లు, భూమి దక్కే వరకు తమ దీక్ష కొనసాగుతుందన్నారు.  జిల్లా కన్వీనర్​బోలేశ్వర్, కో కన్వీనర్​ అరవింద్,  లీడర్లు గంగారాజు, రాజు, కవిన్, శివరామకృష్ణ, సత్యం, శ్యాం, సుభాష్ పాల్గొన్నారు.