దేశంలో తెలంగాణ జైళ్ల శాఖ ఆదర్శం : డీజీ సౌమ్య మిశ్రా

సూర్యాపేట, వెలుగు : దేశంలోనే తెలంగాణ జైళ్ల శాఖ ఆదర్శంగా నిలుస్తోందని ఆ శాఖ డీజీ సౌమ్యమిశ్రా అన్నారు. బుధవారం సూర్యాపేట మండలం ఇమాంపేట వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్​ను ఐజీ మురళి బాబు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ సంప్రీత్ సింగ్ తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం సౌమ్య మిశ్రా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ ను ప్రారంభించామని తెలిపారు. మొదట 2013 లో చంచల్ గూడ జైలు వద్ద పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో మొత్తం 30 పెట్రోల్ బంక్​లు ఏర్పాటు చేశామని తెలిపారు.

Also read :సోనియాగాంధీని కలిసిన మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి

ఖైదీలకు ఉపాధి కల్పించడానికి ఈ పెట్రోల్ బంక్​లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్​ల్లో నాణ్యమైన పెట్రోల్ లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్సీ రాములు, ఇంజన్ ఆయిల్ డివిజిల్ రిటైల్ సేల్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా సబ్ జైలు అధికారి శోభన్ బాబు, సూర్యాపేట సబ్ జైలు సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.