మేడారం జాతరకు .. ఆన్​లైన్​ మొక్కులు

మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించే సదుపాయాన్ని దేవాదాయ శాఖ కల్పించింది. మీసేవ, పోస్టాఫీసు, టీయాప్​ ఫోలియో ద్వారా బుక్​ చేసుకోవచ్చు.

ఆన్​లైన్​లో మొక్కులు చెల్లించుకోవాలనుకున్న వాళ్ల బరువు ప్రకారం ఒక కేజీకి అరవై రూపాయల చొప్పున నిలువెత్తు బంగారం సమర్పించే సేవను బుక్​ చేసుకోవచ్చు. ఇదేకాకుండా పోస్టాఫీసు ద్వారా మేడారం ప్రసాదం కూడా తెప్పించుకోవచ్చు.