సిద్దులగుట్టపై శివలింగాలకు సామూ‌‌‌‌హిక పూజ

ఆర్మూర్, వెలుగు: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆర్మూర్ టౌన్​లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్టపై భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శివాలయం, రామాలయం, దత్తాత్రేయ, దుర్గామాత, అయ్యప్ప ఆలయాల్లో కుమార్ శర్మ, నందీశ్వర మహారాజ్​ ఆధ్యర్యంలో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పుట్ట మట్టితో చేసిన శివ లింగాలకు మహిళలతో సామూహిక అభిషేకాలు చేయించారు.

సీతారాముల, శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలతో రామాలయం నుంచి కోనేరు వరకు పల్లకిసేవ నిర్వహించారు. కాంతి గంగారెడ్డి, అల్జాపూర్ గంగాధర్ కుటుంబీకుల ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదానానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.  కాంగ్రెస్​నియోజకవర్గ ఇన్​చార్జి పొద్దుటూరి వినయ్​రెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.