ఏప్రిల్ 17న శ్రీరామనవమికి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు రావద్దని రామమందిర్ ట్రస్ట్ సోమవారం ( ఏప్రిల్ 15) భక్తులకు విజ్ఞప్తి చేసింది. అయోధ్యలో రాముడి విగ్రహం ప్రతిష్ఠ జరిగిన తరువాత మొదటి సారి శ్రీరామ నవమి వేడుకలకు 25లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అయోధ్యలో భక్తుల రద్దీని నివారించేందుకు శ్రీరామనవమి రోజు అయోధ్యకు రావద్దని రామమందిర్ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది .
అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామాలయం పరిసర ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. లక్షలాది మంది భక్తులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉన్నందున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అయోధ్య రామయ్య శ్రీరామనవమమి వేడుకలను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించాలని తెలిపింది. అయోధ్య రామమందిరంలో జరిగే వేడుకలను వీక్షించేందుకు పరిసర ప్రాంతాల్లో భక్తులు వీక్షించేందుకు 100 ప్రదేశాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తామని అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది .
శ్రీరామనవమి వేడుకలకు లక్షలాది మంది భక్తులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉన్నందున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి పండుగ రోజు 25 లక్షల మంది భక్తులు వస్తారని ట్రస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయోధ్య రామమందిరం చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.ఈ ప్రాంతాన్ని ఏడు జోన్లు, 39 విభాగాలుగా విభజించి ట్రాఫిక్ నిర్వహణను రెండు జోన్లు, 11 క్లస్టర్లుగా విభజించారు. శ్రీరామనవమి వేడుకలకు అవసరమైన అన్ని భద్రతా చర్యల్లో భాగంగా చుట్టుపక్కల సెక్యూరిటీని పెంచినట్లు ఉత్తర ప్రదేశ్ పోలీసు యంత్రాంగం తెలిపింది.
అయోధ్య ధామ్ ప్రాంతం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో భక్తుల కదలికలను.. వాహనాలను పర్యవేక్షించేందుకు 24 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇంకా గోండా బోర్డర్ లో భక్తుల ఇన్ ఫ్లో.. అవుట్ ఫ్లో ను కూడా పరిశీలిస్తామని యూపీ పోలీస్ శాఖ తెలిపింది. అయోధ్య ధామ్‌లో భక్తుల రద్దీ ప్రకారంగా అవసరమైన ప్రదేశాల్లో ట్రాఫిక్ మళ్లిస్తామన్నారు.