Viral Video: అయోధ్య రామయ్యకు వెండి చీపురు విరాళం.. ఎవరంటే

అయోధ్య(Ayodhya) బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయానికి కానుకలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఓ భక్త బృందం వెండి చీపురు(Silver Broom)ను కానుకగా ఇచ్చింది. గర్భగుడిని శుభ్రపరిచేందుకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అఖిల్ భారతీయ మాంగ్ సమాజ్'కు చెందిన రామభక్తులు 1.75 కిలోల వెండి చీపురును కానుకగా అందజేశారు.

అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన తర్వాత, రాముడి దర్శనం కోసం భక్తులు నిరంతరం వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. రోజకు 3, 4 లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకుని రాముల వారిని దర్శించుకుంటున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. మరికొందరు భక్తులు రామాలయానికి చేరుకుని కానుకలు సమర్పించి భావోద్వేగానికి గురవుతున్నారు. 

భక్త సమాఖ్య రామమందిరానికి వెండి చీపురుని కానుకగా ఇచ్చారు. అఖిల్ భారతీయ మాంగ్ సమాజ్ సభ్యులు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు 1.75 కిలోల బరువున్న వెండి చీపురును బహుకరించారు. చీపురు పైభాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఈ చీపురు తయారు చేయడానికి 11 రోజులు పట్టిందని చెప్పారు. రామాలయానికి వచ్చిన భక్తులు ఈ చీపురుతో గర్భగుడిని శుభ్రం చేయాలని కోరారు. 

వెండి చీపురుతో అయోధ్యకు చేరుకున్న భక్తులు జనవరి 22 ప్రారంభోత్సవ వేడుక రోజు రద్దీని తట్టుకోవడం కష్టమని ఆ తరువాతి రోజుల్లో స్వామి వారికి బహుకరించారు. చీపురు లక్ష్మీదేవి స్వరూపమని, అందుకే అఖిల భారతీయ మాంగ్ సమాజ్ వెండి చీపురును శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు బహూకరించిందన్నారు. చీపురు చుట్టూ అందమైన చెక్కడాలు ఉన్నాయి, చీపురులో 108 వెండి కడ్డీలు అమర్చారు. ఆలయాన్ని శుభ్రంచేసేందుకు వీలుగా రూపొందించారు. కాగా దీని బరువు 1.751 కిలోలు అని తయారు చేయించిన వారు వివరించారు.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.