రత్నాపూర్ మల్లన్న కు పోటెత్తిన భక్తులు

  •     ముంపు గ్రామాల భక్తుల నైవేథ్యాలు

బాల్కొండ,వెలుగు : శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామం రత్నాపూర్ మల్లన్న గుడికి  భక్తులు పోటెత్తారు. ఐదేళ్ల తర్వాత ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కు చేరడంతో మల్లన్నకు నైవేద్యాలు  సమర్పిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో 91 గ్రామాలు నీటమునిగాయి.  ప్రస్తుతం  ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్ కు చేరడంతో  పునరావాస గ్రామాల నుంచి ప్రజలు వస్తున్నారు.  

ఇక్కడ కొలువైన  మల్లన్నకు   మొక్కులు చెల్లించుకుంటున్నారు. రత్నాపూర్ గుట్టపై ఉన్న ఆలయ ఆధునీకరణ కోసం భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు.   ఈ గుట్టపై ఐదు నిద్రలు చేస్తే కోర్కెలు నెరవేరుతాయని కొందరు భక్తులు అంటున్నారు. ప్రభుత్వం గుట్ట అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తే పర్యటకంగా  అభివృద్ధి  చెందుతుందని  అంటున్నారు.