చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

నార్కట్​పల్లి, వెలుగు : మండలంలోని చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివారి దర్శనానికి భక్తులు బారులుతీరారు. మహిళలు స్వామివారికి కార్తీక దీపాలు వెలిగించి, సత్యనారాయణస్వామి వ్రతాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

 మూడు గుండ్లపై స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.