వైభవంగా మండల పూజ

మాక్లూర్, వెలుగు : మాక్లూర్ మండల కేంద్రంలోని  శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో మండల పూజా కార్యక్రమం భక్తులు ఘనంగా జరుపుకున్నారు.  గ్రామస్తుల చిరకాల కోరికైన  శ్రీ సీతా రామాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం గత నెల 4న జరిగింది. మండల కాలం పూర్తయిన సందర్భంగా బుధవారం ఉదయం వారం పంచామృతాలతో అభిషేకాలు, ధ్వజారోహణ, నవగ్రహ పూజ, పుణ్యాహ వచనము, అష్ట దిక్పాలకుల పూజ, పంచలోక పాలకుల పూజ, హోమము, బలిహారణం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం జరిగింది.  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం పల్లకీ సేవ జరిపి, భజన నిర్వహించారు.